![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -451 లో..... సాగర్ చిరాకుగా ఇంటికి వస్తాడు. అప్పుడే నర్మద తన దగ్గరికి వెళ్లి ఏంటండి ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది. దాంతో సాగర్ తనపై చిరాకుపడతాడు ఎక్కడి కోపాన్నో నా మీద చూపిస్తున్నారని నర్మద అంటుంది. సాగర్ ఏంటి నీ ఒళ్ళు కాలిపోతుందని నర్మద అంటుంది. ఇంత ఫీవర్ వచ్చిందని బలవంతంగా తనకి టాబ్లెట్ వేస్తుంది. మరొకవైపు వశీకరణ తయాత్తు చందుకి కట్టడానికి భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావు ముగ్గురు కలిసి రామరాజు ఇంటికి వస్తారు.
చందు గదిలో తిరుపతి పడుకుంటాడు. చందు అనుకొని తిరుపతికి ఆనందరావు వశీకరణ తయాత్తు కడతాడు. బయటకు వచ్చి భాగ్యం వాళ్ళతో ప్లాన్ సక్సెస్ అంటాడు. అప్పుడే తిరుపతి నిద్ర లేచి ఏదో పూనుకున్నట్లు ఒక్కసారి గా బయటకు వచ్చి ఎక్కడ ఎక్కడ అంటూ బయటున్న ఆనందరావుని వచ్చి పట్టుకుంటాడు. ప్లాన్ ఫెయిల్ అయినట్లు ఉంది.. వీడికీ తయాత్తు కట్టి ఉంటానని ఆనందరావు అంటాడు. అదంతా ప్రేమ, నర్మద, ధీరజ్ చూసి వాళ్ళకి బుద్ది చెప్పాలనుకొని దుప్పటి వేసి ముగ్గురిని ఈ ముగ్గురు కొడతారు. ఎవరు లేరు ఎవరు కొట్టారని భాగ్యం వాళ్ళు షాక్ అవుతారు. ఎదురుగా చుస్తే నర్మద వాళ్ళు ఉంటారు. మీకు ఇంత జరిగినా సిగ్గు లేదు.. కూతురు కాపురం కూలిపోయింది.. అయ్యో మళ్ళీ చక్కదిద్దాలి అని లేకుండా ఈ పనులు ఏంటని ప్రేమ కోప్పడుతుంది.
నేను చెప్పాను చెల్లి.. వీళ్ళే వినలేదని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కడ నుండి వెళ్తారు. మరుసటిరోజు శ్రీవల్లిని గుర్తుచేసుకొని చందు డల్ గా ఉంటాడు. తనని డైవర్ట్ చెయ్యడానికి ధీరజ్ వాళ్ళు ట్రై చేస్తారు. అప్పుడే ప్రేమ కాఫీ తీసుకొని వచ్చి చందుకి ఇస్తుంది. శ్రీవల్లి కాఫీ చేసి తీసుకొని వచ్చింది గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |